పవర్ గ్రిడ్ అధికారుల నిర్వాకం వల్ల తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లి కి చెందిన రైతు గంగాధర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పవర్ గ్రిడ్ అధికారులు టవర్లు ఏర్పాటులో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఒకటిన్నర సంవత్సరము నుంచి పోరాటం చేస్తున్నానన్నారు. పోలీసులు దగ్గరుండి టవర్లు ఏర్పాటు చేయించారన్నారు. ఇది అన్యాయమన్నారు. తాడిపత్రి ఏ ఎస్పీ దగ్గరుండి టవర్లు ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయంపై 15వ తేదీ తాను రైతులు తరఫున ఆందోళనకు దిగుతానన్నారు.