కోడుమూరు: కల్లపరిలో కళ్ళందొడ్డిలో ఉంచిన వరిగడ్డి దగ్ధం, ఎద్దులకు తప్పిన ప్రమాదం
కోడుమూరు మండలంలోని కల్లపరి గ్రామంలో ఓ రైతుకు చెందిన వరిగడ్డి దగ్ధమైంది. కళ్ళంకి చేర్చిన వరిగడ్డి ఆదివారం తెల్లవారుజామున మంటలు వ్యాపించి కాలిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఇంట్లో నిద్రిస్తున్న రైతు కుటుంబం తేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫలించలేదు. కళ్ళంలో కట్టి ఉంచిన ఎద్దులను తప్పించారు. మూగజీవాల కోసం ఉంచిన గ్రాసం మంటలకు కాలిపోవడంతో రైతు విచార వదనంలో మునిగిపోయాడు.