ఎంతోమంది త్యాగ ఫలాలను మరవరాదు: జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Oct 21, 2025
దేశం కోసం ప్రాణాలతో అర్పించిన ఎంతోమంది మహానుభావులను మరవరాదని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. మంగళవారం ఒంగోలు పట్టణంలో నిర్వహించిన పోలీసుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో రాజాబాబు పాల్గొన్నారు. పోలీసులు ఆర్మీ ఉద్యోగులు వారు చేసిన ప్రాణ త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయని దేశం కోసం వారు చేసిన సేవలు మరువలేని అన్నారు. యువత విద్యార్థులు అటువంటివారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. గతంలో చైనా లో జరిగిన దర్శనాలు 10 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.