పిఠాపురం వెంకన్న బాబు పాట ను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి విశ్వ ఐదోవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు
పురాతన హైందవ సాంప్రదాయలకు విఘతం కలిగించేలా వ్యవహరించిన కానిస్టేబుల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మంగయమ్మరావుపేట, ఇంద్రానగర్ లో హిందూ పురాతన సాంప్రదాయ పద్ధతిలో వెంకన్న బాబు పాట అక్కడ స్థానికులు నిర్వహించారు.. హిందువులు ఏంతో సంప్రదాయంగా నిర్వహించే సదురు కార్యక్రమంలో పోలీసుల అడ్డుకొని కార్యక్రమాన్ని నిలిపేయాలని దౌర్జన్యం చేశారంటూ అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకుడు వెంకటేశ్వరరావు ఆదివారం ఉదయం 11 గంటలకు మాట్లాడారు .