అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో రోడ్డు విస్తరణలో భాగంగా జిహెచ్ఎంసి అధికారులు రోడ్డు పక్కన ఉన్న షాపులు ఇళ్లను కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమక్షంలో కూల్చివేతలు జరిగాయన్నారు. తులసి వనం వరకు విస్తరణ చేయకుండా పేదల ఇల్లు లక్ష్యంగా చేసుకొని కూల్చారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.