బాన్సువాడ: బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పాము కలకలం
బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో పాము కలకలం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు గదిలోకి పాము చొరబడింది. పాము కదలికలను చూసిన ఆస్పత్రి సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. కొందరు సిబ్బంది వచ్చి పామును కర్రలతో కొట్టి చంపారు. వర్షం మూలంగా ఆసుపత్రి ఆవరణలో పిచ్చి మొక్కలు మొలవడంతో పాము ఆస్పత్రిలోకి వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేసి మొరం వేయాలని స్థానికులు కోరుతున్నారు.