గుంతకల్లు: గుత్తి లోని నేమతాబాద్ రోడ్డులో నూతనంగా నిర్మించిన గృహాలను ప్రారంభించిన కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే లు
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని నేమతాబాద్ రోడ్డులో ప్రభుత్వం నిర్మించిన నూతన గృహాలను బుధవారం జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎంపీ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ లు ప్రారంభించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడారు.కూటమి ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించడం జరిగిందన్నారు.గుత్తిలో రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడి యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.