సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మిక తనిఖీలు
తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి సూళ్లూరుపేట టోల్ గేట్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, ఆర్టీవో అనిల్ కుమార్, దొరవారిసత్రం ఎస్సై అజయ్ కుమార్, సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు నేతృత్వంలో దాడులు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాహన పత్రాలు, లగేజ్ పరిమితి వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు.