అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి అమ్మవారి ఆలయం గోదావరి వరద నుంచి క్రమేపీ బయటపడుతుంది. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు దేవస్థాన ఈవో లక్ష్మి కుమార్ తెలిపారు. కొద్ది రోజులుగా గోదావరి వరద కారణంగా అమ్మవారి ఆలయం పూర్తిగా మునిగిపోయిందని, భక్తులకు దర్శనాలు నిలిపివేయడం జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో అమ్మవారి ఆలయం బయటకు కనిపిస్తుందని,సగానికి పైగా నీటిమట్టం తగ్గడం వల్ల అమ్మవారి ఆలయం బయటకు కనిపిస్తుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో అమ్మవారి ఆలయం పూర్తిగా వరద నుంచి బయట పడుతుందన్నారు