కారంపూడి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో స్వామిత్వ సర్వే : ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి
కారంపూడి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో స్వామిత్వ సర్వే నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి మీడియా కు తెలియజేశారు. ముందుగా గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా కొలతలు తీయడం జరుగుతుందన్నారు. అనంతరం ఇంటి యజమానికి హౌస్ కార్డు కూడా ఇవ్వటం జరుగుతుందన్నారు. కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పేర్కొన్నారు.