నరసాపురం: నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయకర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు స్వయంగా వెళ్లి బాధితులు వైద్య చికిత్స పొందిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికు దరఖాస్తు చేసుకుని మంజూరైన చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఈ నిధులు వైద్య చికిత్సల ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ఒక ఆశాకిరణంగా నిలుస్తున్నాయి అన్నారు. మొత్తం ₹11,04,711 రూపాయలు అందజేశానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు బొమ్మిడి నాయకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.