రేషన్ మాఫియా మళ్ళీ చెలరేగిపోతుంది. పోలీసుల, అధికారుల కళ్లుగప్పి బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుంది. పొదలకూరు మండలం మరుపూరు వద్ద విజిలెన్స్ సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు.వెంకటగిరి నుంచి నెల్లూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్నారు. పట్టుకున్న రేషన్ బియ్యం విలువ సుమారు రెండు లక్షలు, వాహనం విలువ 9 లక్షలు విలువ ఉంటుందని అధికారులు శుక్రవారం సాయంత్రం తెలిపారు.