ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుంది :ఉషశ్రీ చరణ్
ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ బుధవారం పెనుకొండలో అన్నారు. కూటమి ప్రభుత్వం అరకొర హామీలు అమలు చేసిందని విమర్శించారు. మంత్రి సవిత ఆటో డ్రైవర్‌పై హుకుం జారీ చేయడమేంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో నిర్మించిన గోడౌన్లను ఆమె మందు గోడౌన్‌గా మార్చారని తీవ్రంగా ధ్వజమెత్తారు.