గుంతకల్లు: గుత్తి మండలం పూలకుంట గ్రామంలో 18 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్, రూ.42.230 నగదు స్వాధీనం, కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని పూలకుంట గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తి మండలం పూలకుంట గ్రామ సమీపంలోని బహిరంగ ప్రదేశంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి 18 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న రూ.42,230 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామని సీఐ తెలిపారు. మండలంలో ఎక్కడైనా ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ రామారావు కోరారు.