ఉదయగిరి: వెంకటంపేట వద్ద బాణసంచా దుకాణాలను తనిఖీ చేసిన పోలీస్, అగ్నిమాపక అధికారులు
ఉదయగిరి పట్టణం, దుత్తలూరు మండలం వెంకటం పేట వద్ద గల బాణసంచా విక్రయాల దుకాణాలు, తయారీ యూనిట్ ను ఉదయగిరి సీఐ వెంకట్రావు, ఉదయగిరి, వరికుంటపాడు ఎస్ఐలు, ఉదయగిరి అగ్నిమాపక శాఖ అధికారి హరిబాబు తో కలసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిల్వ ఉన్న బాణసంచాను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బాణసంచా విక్రయాలు, తయారీ వద్ద ముందస్తు జాగ్రత్తలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. అనంతరం నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు.