తాడిపత్రి పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో మంగళవారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా తాడిపత్రిలోని అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఎక్కడ చూసినా భక్తులు సందడే కనిపించింది. భక్తులు బారులు తీరి ఉత్తర ద్వారం ద్వారా ఆలయాల్లోకి ప్రవేశించి స్వామి వారలను దర్శించుకున్నారు.