శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులను టార్గెట్ చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న మోసగాళ్లను దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీశైలానికి వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటూ తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకున్న కొందరు కేటుగాళ్లు బ్యాచులు బ్యాచులుగా ఏర్పడి, ఇతర రాష్ట్రాల భక్తులను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. “మా పరిస్థితి బాగోలేదు”, “కుటుంబ యజమానికి పక్షవాతం వచ్చింది” వంటి కుంటి సాకులు చెబ