నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో బుధవారం శ్రీ అనంత నాగేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా వృషభల పోటీలను నందికొట్కూరు శాసనసభ్యులకు గిత్త జయ సూర్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, న్యూ క్యాటగిరి సైజు ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే దగ్గర ఉండి పర్యవేక్షించారు, సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిడిపి కన్వీనర్ మోహన్ రెడ్డి టిడిపి నాయకులు గిరీష్ రెడ్డి తరిగోపుల గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు