అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలోని 19 ప్రభుత్వ హాస్పిటల్స్ డాక్టర్స్ తో ఐటిడిఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు ఐటిడిఏ పీవో కట్ట సింహాచలం తెలిపారు. ఏజెన్సీలో అందరి డాక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈనెల 12వ తేదీన అన్ని ప్రాంతాలలో విద్యార్థులకు, పిల్లలకు, అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నులిపురుగుల మాత్రలు వేయాలని సూచించినట్లు చెప్పారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి డాక్టర్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.