యాత్రికులతో మర్యాదగా ప్రవర్తించాలి రేణిగుంట సిఐ జయచంద్ర వెల్లడి
యాత్రికులతో మర్యాదగా ప్రవర్తించాలి: సీఐ జయచంద్ర రేణిగుంట రైల్వే స్టేషన్ పరిసరాల్లోని ఆటో స్టాండ్, సుమో స్టాండ్ డ్రైవర్లతో సీఐ జయచంద్ర శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు విచ్చేస్తారని, వారి పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని సూచించారు. యాత్రికులపై అధిక ఛార్జీలు వసూలు చేయకూడదని తెలిపారు.