కొత్తపట్నం మండలంలోని తీర ప్రాంత గ్రామాలను సందర్శించి పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Oct 22, 2025
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండటంతో పాటు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ప్రకాశం జిల్లా కు తుఫాన్ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు, జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం మండలాల్లోని మత్స్యకార గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రభుత్వం యంత్రాంగం చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు మత్స్యకారులను అప్రమత్తం చేయడం జరిగింది.