ద్వారకాతిరుమలలో విశ్వకర్మ జయంతి వేడుకలలో పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు
Eluru Urban, Eluru | Sep 17, 2025
విశ్వాన్ని నిర్మించినది విశ్వకర్మ అని, విశ్వకర్మ జయంతిని ప్రభుత్వం అధికారికి కార్యక్రమంగా జరపడం అభినందనీయం అని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. విశ్వకర్మ జయంతి మహోత్సవం ద్వారకాతిరుమలలో బుధవారం ఘనంగా నిర్వహించారు.. స్థానిక అళ్వార్ సదనంలో జరిగిన ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు హాజరయ్యారు. ఆయనకు సంఘసభ్యులు విశ్వకర్మ భగవానుని ప్రతిమను అందచేసారు. ఈక్రమంలో ఏర్పాటుచేసిన వేదికపై గాయత్రిమాత, విశ్వకర్మ భగవానుని చిత్రపటాలను ఉంచి సంఘసభ్యులు ప్రత్యేకపూజలు జరిపారు. ముందుగా విఘ్నేశ్వరపూజ, శ్రీగాయత్రివిశ్వకర్మ పూజలు, జరిపారు.