ఆందోల్: ఘనపూర్ ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగు కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి రెండో విడతలో 2667 క్యూసెక్కుల నీరు విడుదల
ఘనపూర్ ఆయకట్టు రైతులు వ్యవసాయ సాగు అవసరాల కోసం సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నుంచి రెండో విడత నీటిని నేడు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో నీటి పారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం స్పిల్‌వే గేట్స్ ద్వారా మంజీరా బ్యారేజ్‌కు 2667 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.