మహదేవ్పూర్: కాళేశ్వరం లో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మిషన్ భగిరధ వాటర్ ట్యాంక్ పై ఎక్కి యువకుడి హల్ చల్.. కాళేశ్వరం గ్రామం విశ్వ కర్మ కులానికి చెందిన ముమ్మడి రాకేష్ అనే యువకుడు గత కొద్ది రోజులు గోదావరి వద్ద శ్రాద్ధ కర్మ పూజలు చేసుకుంటు జీవనం సాగిస్తునాడు. యాదవిధిగా ఈ రోజు కూడా గోదావరికి వెళ్ళాగా అక్కడ బ్రాహ్మణ సంఘం ఈ రోజు నుండి గోదావరి కి రావద్దు అని చెప్పడంతో మనస్థాపానికి గురైన యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ పట్టుకుని తనకి న్యాయం చేయాలని నిరసన.. గుమికూడిన జనం.. యువకుడికి సర్ది చెప్పే ప్రయత్నంలో పోలీసులు