ప్రకాశం జిల్లా మర్రిపూడి, చీమకుర్తి మండలాలలో పేకాట ఆడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 వేల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.