తాడిపత్రిలోని పార్కులో ఈసారి జరిగే న్యూ ఇయర్ వేడుకలకు మాధవీలతను ఆహ్వానిస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కంటే ఈసారి మరింత ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మాధవి లత కు, తనకు మాటల యుద్ధం జరిగిందన్నారు. అయితే ఇద్దరూ పరస్పరం సారీ చెప్పుకొని కాంప్రమైజ్ అయ్యామన్నారు. ఈసారి ఆమెను వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తానన్నారు. వచ్చేది రానిది ఆమె ఇష్టమన్నారు.