అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన భర్తకు 10 సంవత్సరాల జైలుశిక్ష
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం చింతల పల్లె గ్రామానికి చెందిన నంద్యాల గోపాల్ తన కూతురు రాజేశ్వరిని అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామానికి చెందిన కనకం కృష్ణయ్యకి ఇచ్చి వివాహం చేశారు. అదనపు కట్నం తేవాలని కృష్ణయ్య ఆయన చిన్నాయన నారాయణ రాజేశ్వరిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడింది. వీరిపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో 05.03.2025 కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది సుదీర్ఘ విచారణ అంతా మంగళవారం నంద్యాల కోర్ట్ నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 4000 జరిమానా విధించింది