మేడ్చల్ మున్సిపాలిటీలో మంచినీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో తాగునీరు అందక ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS) అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్య తీవ్రతను వారి దృష్టికి తీసుకువచ్చారు. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు.