అసిఫాబాద్: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి:తుడుందెబ్బ జాతీయ అధ్యక్షులు పోచయ్య
లంబాడిలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని తుండుదెబ్బ జాతీయ అధ్యక్షుడు బుర్శ పోచయ్య అన్నారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలోని ప్రేమల గార్డెన్ లో నిర్వహించిన ఆదివాసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు 1976 లో అప్పటి ప్రభుత్వం వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం డీఎన్టీలుగా లంబాడిలకు అవకాశం కల్పిస్తే..అది అదునుగా భావించిన ఇప్పుడు ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. దీంతో ఆదివాసీలకు అందాల్సిన రిజర్వేషన్. హక్కులను లంబాడి లు అనుభవిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని లంబాడి లను ఎస్టీ జాబితా నుండి వేంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.