అసిఫాబాద్: నిందితుడిని కఠినంగా శిక్షించాలి: KVPS జిల్లా నాయకులు
ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం గెర్రే గ్రామంలో తన కుమారుడు కులం తక్కువ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో సత్తయ్య కిరాతకానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలు శ్రావణిపై కత్తి, గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనను KVPS జిల్లా నాయకులు కుల దురాహంకార హత్యగా పేర్కొన్నారు. సోమవారం KVPS జిల్లా నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.