ఉదయగిరి: తుఫాన్ ప్రభావంతో ఉదయగిరి ప్రాంతంలోని అడవులలో పారే సెలయేళ్లు
తుఫాన్ ప్రభావంతో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉదయగిరి ప్రాంతంలోని అడవులు, పారే సెలయేళ్లు, దుమికే జలపాతాలతో పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. దుర్గంపల్లిలోని సెలయేళ్లు తెల్లటి నురగలు కక్కుతూ.. పరవళ్లు తొక్కుతూ ఆహ్లాద వాతావరణన్ని పంచుతున్నాయి. అడవుల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉదయగిరి దుర్గంపై ఉన్న సల్వా పేట్ జలపాతం డ్రోన్ షాట్లో చూడముచ్చటగా ఉంది.