సత్తుపల్లి: చతిస్గడ్ జర్నలిస్ట్ చంద్రకర్ హత్యను ఖండిస్తూ సత్తుపల్లిలో జర్నలిస్టుల నిరసన..
చతిస్గడ్ లో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యను ఖండిస్తూ సత్తుపల్లి పట్టణంలో సత్తుపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఓ రోడ్డు వర్క్ కు సంబంధించి అవినీతిని వెలికి తీసిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను సదరు రోడ్డు కాంట్రాక్టర్ అతి కిరాతకంగా హత్య చేయటం బాధాకరమన్నారు.దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.