ఇల్లందు: కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం గుండాల మండలం కాచినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వెజ్ వర్కర్లు తమ డిమాండ్ల కోసం నిరవధిక సమ్మెకు దిగారు. డైలీ వెజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని టైం స్కేల్ ప్రకారం వేతనం చెల్లించాలని మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారి డిమాండ్ చేశారు డిమాండ్లు నెరవేరేవరకు విధులకు హాజరుకామని వారు వెల్లడించారు.