అదిలాబాద్ అర్బన్: బీఆర్ఎస్ లో చేరిన నేరడీగొండ మండల బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో నెరడిగొండ మండల బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షుడు చెట్పల్లి వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరితో పాటు కిసాన్ మోర్చా మండల కార్యదర్శి ఉయిక గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గస్కంటి సంజీవ్, బిజెపి నాయకులు చెట్పల్లి సంతోష్, రవి కూడా బీఆర్ఎస్ లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.