కదిరి ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ను ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య మంగళవారం ఆకస్మికంగా తనకి నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి ఎక్సైజ్ స్టేషన్ సిఐ తనకల్లు ఎక్సైజ్ స్టేషన్ సిఐ లతో కలిసి ఆయన నేరాలపై సమీక్షించారు. ములకలచెరువులో కల్తీ మద్యం ఘటన నేపథ్యంలో ఆయన తనిఖీ చేసినట్టుగా తెలియజేశారు. కల్తీ మద్యం కల్తీ కల్లును అరికట్టాలని అధికారులకు ఆదేశించారు.