భువనగిరి: ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలమైన ఆరోపణ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల స్వామీలు శుక్రవారం సంచలమైన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మదర్ డైరీ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పొత్తు కోసం బంధుత్వాలను వాడుతూ కాంగ్రెస్ ను బలి చేయవద్దని ఫైరయ్యారు. ఈ ఎన్నికకు సంబంధించి ఎక్కువ ఓట్లు ఆలేరు నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు.బిఆర్ఎస్ గెలిస్తే ఐలయ్య నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.