పాణ్యం: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న, జోహార్ బి రాజ్యముల,కార్మికుల అక్రమ తొలగింపులు మానుకోవాలి :CPM పార్టీ నాయకులు డిమాండ్
కల్లూరు మండలంలోని షరీఫ్‌నగర్, లక్ష్మీపురం స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న జహారాభి, రాజమ్మల తొలగింపులు అక్రమమని సీఐటియు నేతలు డీఈవో ఎస్.శామ్యూల్ పాల్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ కల్లూరు మండలం షరీఫ్‌నగర్, లక్ష్మీపురం స్కూళ్లలో పని చేస్తున్న జహారాభి, రాజమ్మల పట్ల న్యాయం చేయాలని డీఈవో శామ్యూల్ ను కోరారు. ఈ స్పందించిన డీఈవో జోక్యం చేసుకుని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.