బైకుల దొంగలకు చెక్ పెట్టిన తడ పోలీసులు
- ఐదు మంది బైకు దొంగలను అదుపులోకి తీసుకున్న తడ ఎస్సై కొండాప్పనాయుడు
తిరుపతి జిల్లా తడ, సూళ్లూరుపేట మండలాల్లో మోటార్‌సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను మంగళవారం తడ పోలీసులు అరెస్ట్ చేశారు. తడ బస్‌స్టాండ్ వద్ద జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి మొత్తం 11 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11 లక్షలు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ సారథ్యంలో, తడ ఎస్ఐ కొండప్ప నాయుడు సిబ్బందితో కలిసి ఈ కేసు చేధించారు. ప్రతిభ కనబరిచిన అధికారులను ఎస్పీ అభినందించారు.