మార్కాపురం: పొదిలి సర్కిల్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా పలు సూచనలు చేసిన సీఐ రాజేష్ కుమార్
ప్రకాశం జిల్లా పొదిలి సర్కిల్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన సీఐ రాజేష్ కుమార్ పలు సూచనలు చేశారు. బాణాసంచ పేల్చే సమయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాణాసంచా విక్రయదారులు తగిన నిబంధనలు పాటించాలన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అక్రమంగా బాణాసంచ నిల్వ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.