మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక కుటుంబంలో ఉండి పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుటుంబంలో ఏవైనా విభేదాలు వచ్చినా సర్దుబాటు చేసుకోవాలన్నారు.