పూతలపట్టు: శబరిమల యాత్ర పూర్తి చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్‌కు కాణిపాకంలో ఘన స్వాగతం
శబరిమల యాత్ర పూర్తి చేసిన ఎమ్మెల్యే మురళీమోహన్‌కు కాణిపాకంలో ఘన స్వాగతం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ 41 రోజుల అయ్యప్ప దీక్షను పూర్తి చేసి శబరిమల దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో కాణిపాకం ఆలయంలో పుణ్య స్నానం చేసి మాలను విరమణ చేశారు. వేదపండితులు ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు సత్కరించారు. ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించానని ఎమ్మెల్యే తెలిపారు.