సీఎం భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లి లో నవంబర్ 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీను సీఎం చంద్రబాబు నాయుడు అందించనున్న నేపథ్యంలో ఆయన పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ లు శుక్రవారం పరిశీలించారు. సీఎం దిగి హెలిపాడ్ ప్రదేశం, భోజన వసతి ఏర్పాట్లు, చేపట్టాల్సిన భద్రత, పార్కింగ్ స్థలం తదితర అంశాలపై వారు క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.