పోచంపల్లి: పట్టణంలో పర్యటించిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం సహాయం చేస్తానని వెల్లడి
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం మధ్యాహ్నం విస్తృతంగా పర్యటించారు. మొదట కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం చేనేత పార్కును సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమ దేశంలోని రెండవ అతిపెద్ద పరిశ్రమ అని తెలిపారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రధాని మోడీ జాతీయస్థాయిలో గుర్తింపు తేవాలని జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.