గాండ్లపెంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ, కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయం, కెమిస్ట్రీ ల్యాబ్, కిచెన్ గార్డెన్, రైన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి కృషి చేస్తుందని తెలియజేశారు.