పూతలపట్టు: బంగారు పాల్యం మండలంలోని మొగిలి గోని వారి చెరువు నిండి జలకళ
సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా బంగారుపాళ్యం మండలంలోని కౌండిన్య అడవి ప్రాంతంలో గోని వారి చెరువు నిండిపోగా, చెరువు పరిసరాలు జలకళ సంతరించుకున్నాయి. చెరువు పొంగిపొర్లుతూ ఉండడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ దృశ్యాన్ని ఆస్వాదించారు. అయితే చెరువు నీరు మరవగా పోతుండటంతో చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనులకు అంతరాయం కలిగింది. పనులు కొనసాగించాల్సిన కార్మికులు నీటి ప్రవాహం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.