రైస్ మిల్ నుండి సిఎంఆర్ బియ్యంను నాణ్యత ప్రమాణాలను పరిశీలించి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు 3 లారీలకు రూ.75 వేలు సివిల్ సప్లై మేనేజర్ నర్సింగరావు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ACB డిఎస్పీ మధు తెలిపారు. గురువారం రాత్రి 9 గంటలకు ఆయన మాట్లాడుతూ.. బాధితుడు 3 లారీలకు సంబంధించిన రూ.75 వేలు నర్సింగరావుకు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. నర్సింగరావుతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగి మణికంఠను అదుపులోకి తీసుకొని కార్యాలయంలో విచారణ చేపట్టారు.బాధితుడు నుండి ఇప్పటికే 16 లారీలకు సంబంధించిన డబ్బులు పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకున్నట్లు డి.ఎస్.పి వెల్లడించారు