కోడుమూరు: రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన కేడిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
గూడూరు పట్టణానికి చెందిన ఇద్దరు, వారి బంధువు కర్నూలు సంతోష్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్, సుమన్ అక్కడికక్కడే మృతి చెందారు. నవీన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసి బుధవారం కేడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ధైర్యం చెప్పారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. మృతదేహాలకు త్వరగా పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు.