అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7.9మీ.మీ వర్షపాతం నమోదు
గడిచిన 24గంటల్లో ఆసిఫాబాద్ జిల్లాలో 7.9మీ.మీ వర్షపాతం నమోదైనట్లు ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబందాల శాఖ అధికారి సంపత్ కుమార్ తెలిపారు. అత్యధికంగా కెరమెరి మండలంలో 30.6 మీ.మీ వర్షపాతం నమోదు కాగా దహెగంలో 11.2,పెంచికల్ పెట్ 9.2,బెజ్జూర్ 6.6,చింతలమనేపల్లి 1.0, సిర్పూర్ టీ 1.2,కౌటాల 0.8, కాగజ్ నగర్ 4.6,వాంకిడి 5.o, ఆసిఫాబాద్ 6.8, రెబ్బెన 5.4, తిర్యాణి 15.4,లింగాపూర్ 8.2, సిర్పూర్ యూ 5.8, జైనూర్ 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిందన్నారు.