మేడిపల్లి: మండల కేంద్రంలో ఆర్టీసీ కార్గో లాజిస్టిక్ సేవలను ప్రారంభించిన కరీంనగర్ రీజనల్ ఏటీఎం వీ రామారావు
మేడిపల్లి మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సమయంలో ఆర్టిసి కార్గో లాజిస్టిక్ సేవలను కరీంనగర్ రీజనల్ ఏటీఎం రామారావు ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సేవలు ఉద్దేశించి రామారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రలో కూడా ఆర్టీసీ కార్గో అందుబాటులో ఉందని తెలిపారు మేడిపల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల ప్రజలు కార్గో సేవలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.