పెండింగ్ లోని 6000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ లోని హస్తినాపురం చౌరస్తాల విద్యార్థులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఏర్పడి మూడేళ్లయిన స్కాలర్షిప్లు, రెయిన్బర్స్మెంట్ విడుదల చేయడంలో కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.